టచ్ టైపింగ్ స్టడీకి స్వాగతం!

మీరు ఇంకా రెండు వేళ్లతోనే టైప్ చేస్తున్నారా? ప్రతి కీ మీద కొట్టేముందు ఇంకా కీ బోర్డ్ చూడవలసి వస్తోందా?
టచ్ టైపింగ్ స్టడీ మీరు సులభంగా టైపింగ్ నేర్చుకోవడానికి, అభ్యాసం చేయటానికి, వేగంగా మరియు తప్పులు లేకుండా టైప్ చేయటం మెరుగుచేసుకోవటానికి తీర్చిదిద్దిన ఒక ఉచిత వెబ్సైట్.
ఒకసారి మీరు టచ్ టైపు చేయటం నేర్చుకున్నారంటే మీరు టైప్ చేయవలసిన అక్షరాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు కీ బోర్డ్ చూడవలసిన అవసరం ఉండదు మరియు మీరు చాలా వేగంగా టైపు చెయ్యగలరు!
టచ్ టైపింగ్ దృశ్యాన్ని కాకుండా కండరాల కదలికలను మస్తిష్కంలో భద్రపరచుకొనే పద్ధతి మీద ఆధారపడి ఉంది. ఈ పద్ధతి మరింత అధిక వేగంతో డేటా ఎంట్రీ చేయగలిగే అవకాశాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఇతర వ్రాతప్రతులనుండి పాఠ్యభాగాలను టైప్ చేయవలసివచ్చినప్పుడు.
టచ్ టైప్ పద్ధతి తో టైపింగ్ చేయటం మీ కంప్యూటర్ ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది; అది డేటా ఎంట్రీ వేగాన్ని పెంచుతుంది; మరియు వీలైనంత వరకు కళ్ళకు అలసట మరియు హాని తగ్గిస్తుంది.
టచ్ టైపింగ్ స్టడీ లో 15 పాఠాలు, ఒక వేగ పరీక్ష, టైప్ చేయటం అంచెలంచెలుగా నేర్చుకునేందుకు, స్వీయ పురోగతిని గమనించేందుకు మరియు ఆనందించేందుకు వీలుగా ఆటలు ఉన్నాయి!

కీబోర్డ్ రూపురేఖలు