మీరు ఇంకా రెండు వేళ్ళతోనే టైప్ చేస్తున్నారా? ప్రతి కీస్ట్రోక్ కు ముందు ఇంకా కీబోర్డ్ వైపు చూడవలసి వస్తోందా?
టచ్ టైపింగ్ స్టడీ మీరు సులభంగా టైపింగ్ నేర్చుకోవడానికి, అభ్యాసం చేయటానికి, వేగంగా మరియు తప్పులు లేకుండా టైప్ చేయటం మెరుగుపరచుకోవటానికి తీర్చిదిద్దిన ఒక ఉచిత వెబ్‌సైట్.
ఒకసారి మీరు టచ్ టైపింగ్ నేర్చుకున్నారంటే, మీరు టైప్ చేయవలసిన అక్షరాలు ఎక్కడున్నాయో కనుగొనేందుకు కీబోర్డ్ వైపు చూడవలసిన అవసరం ఉండదు మరియు మీరు చాలా వేగంగా టైప్ చేయగలరు!
టచ్ టైపింగ్ దృష్టిపై కాకుండా కండరాల జ్ఞాపకశక్తిపై ఆధారపడిన పద్ధతి. ఈ పద్ధతి మరింత అధిక వేగంతో డేటా నమోదు చేయగలిగే అవకాశాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా ఇతర దృశ్య పత్రాల నుండి పాఠ్యాన్ని టైప్ చేయవలసివచ్చినప్పుడు.
టచ్ టైపింగ్ పద్ధతితో టైప్ చేయటం మీ కంప్యూటర్ ఉత్పాదకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది; అది డేటా నమోదు వేగాన్ని పెంచుతుంది మరియు వీలైనంత వరకు కళ్ళకు అలసట మరియు నష్టాన్ని తగ్గిస్తుంది.
టచ్ టైపింగ్ స్టడీలో 15 పాఠాలు, ఒక వేగ పరీక్ష మరియు ఆటలు ఉన్నాయి — వీటి ద్వారా మీరు అంచెలంచెలుగా టైపింగ్ నేర్చుకోవచ్చు, స్వీయ పురోగతిని గమనించవచ్చు మరియు ఆనందించవచ్చు!